ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 7:27 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రామగిరి మండలంలో ప్రజా పాలన దినోత్సవంఅన్ని గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండా ఆవిష్కరణ.

రామగిరి మండలంలో ప్రజా పాలన దినోత్సవంఅన్ని గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండా ఆవిష్కరణ.

అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 17, రామగిరి డెస్క్:

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగిరి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. ఆదివారంపేట గ్రామంలో సర్పంచ్‌ ఇల్లందుల సంజీవ్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అలాగే అన్ని గ్రామ పంచాయతీల్లో ఆయా సర్పంచుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

రాజాపూర్‌ గ్రామంలో సర్పంచ్‌ శ్రీమతి పుల్లెల భాగ్యలక్ష్మి కొమురయ్య జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం గ్రామసభ నిర్వహించారు. గ్రామాభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యలపై గ్రామసభలో చర్చించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ కలవేనా శ్రీకాంత్‌, పంచాయతీ కార్యదర్శి కిరణ్‌, వార్డు సభ్యులు కాల్వ రజిత శ్రీనివాస్‌, పుల్లెల సుజాత సతీష్‌, ఎండీ హఫీజ్‌, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, సీఏలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.